వితంతువులను పెళ్ళాడితే రూ.2 లక్షలు

వితంతు వివాహాలను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వితంతువులను పెళ్ళి చేసుకుంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలలకిందట విడో మ్యారేజీలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీ తయారు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం వితంతు వివాహాలను ప్రొత్సహించేందుకు ముందడుగు వేసింది. ఈ పథకం ఒకవేళ విజయవంతమైతే ప్రతి ఏడాది వెయ్యి వితంతు వివాహాలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. 18 నుండి 45 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది.

Updated: October 10, 2017 — 3:56 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017