కలెక్టరేట్ ప్రజలకు అందుబాటులో ఉండాలి:జూలకంటి రంగారెడ్డి

Julakanti Rangareddyసూర్యాపేట టౌన్ : సూర్యాపేట పట్టణానికి చేరువలో, ప్రజలకు అందుబాటులో ఉండాలన్న సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జూలకంటి మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నల్లచెరువు వద్ద అవసరమైనంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా, కేవలం కొద్ది మంది అధికార పార్టీకి సంబందించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ది కోసమే సూర్యాపేట పట్టణానికి దూరంగా, ఎలాటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని కుడకుడ ప్రాంతంలో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చెస్తున్నారని రంగారెడ్డి అన్నారు. ప్రస్తుతమున్న ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా కేంద్రంకు దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొత్తగా శాశ్వతంగా ఏర్పాటు చేసే కార్యాలయాలు ఏ ఒక్కరికో లబ్ది చేకూర్చే విధంగా ఉండవద్దని, ఈ విషయంలో ముఖ్యమత్ర్, స్థానిక మంత్రి పునరాలోచన చేయాలని జూలకంటి హితవు పలికారు. ఈ విలేకర్ల సమావేశంలో సిపియం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మల్లు నాగార్జున రెడ్డి, ధిరావత్ రవినాయక్, జిల్లా కమిటి సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, బుర్రి శ్రీరాములు, ఎల్గూరి గోవింద్, దండా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Julakanti Rangareddy

Updated: October 11, 2017 — 2:33 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017