జర్నలిస్టులకు,ఉద్యోగులకు వరంగల్ లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు : సీఇఓ పద్మ

Sharing is caringShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

వరంగల్ : జర్నలిస్టులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆరోగ్యపథకానికి సంబందించిన వెల్‌నెస్ సెంటర్ ను నవంబర్ మొదటి వారంలో ప్రరంభించనున్నట్లు ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యదర్శి కల్వకుంట్ల పద్మ వెల్లడించారు. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో యు.ఎఫ్.డబ్య్లూ.ఏ.శిక్షణాకేంధ్రం భవనంలో ఏర్పాటు చేయనున్నారు. బుధవారం పనులను పరిశీలించడానికి వచ్చిన డాక్టర్ పద్మను టీయూడబ్య్లుజే రాష్ట్ర సం యుక్త కార్యదర్శి మెండు రవిందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పిన్న శివకుమార్ లు కలిసి కేంద్రం ఏర్పాటు గురించి మాట్లాడారు. ఈ కేంద్రం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా లోని 48 వేల మంది
జర్నలిస్టులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు వైద్య సేవలు అందుతాయని డాక్టర్ పద్మ తెలిపారు.

Updated: October 11, 2017 — 11:46 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017