ఆదివారం జరిగే సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన కడియం శ్రీహరి

వరంగల్ రూరల్ (న్యూస్24గంటలు) : కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పర్క్ కు రేపు ఆదివారం సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభా ఏర్పాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి వేదిక వద్దనే మీడియా తో మాట్లాడుతూ, ఆదివారం వరంగల్ కు సంబందించిన 4 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సీఎం శంఖుస్థాపన చేస్తారన్నారు. కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గొర్రెలు,మేకల అభివృద్ది సంస్థ చైర్మెన్ రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే,పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్, సీపి సుధీర్ బాబు, వరంగల్ రూరల్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీఓ మహేందర్, మామునూర్ ఏసిపి శోభన్ ఇతర అధికరులు ఉన్నారు.

Updated: October 22, 2017 — 2:47 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017