కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ కు శంకుస్థాపన చేసిన సభలోనే పరకాలకు రూ.50 కోట్ల నిధులిస్తానన్న సిఎం కేసీఅర్

వరంగల్ రూరల్(న్యూస్24గంటలు) : కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ కు ఆదివారం శంకుస్థాపన చేసిన సిఎం కేసీఅర్. టెక్స్ టైల్స్ పార్క్ శంకుస్థాపన కోసం గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద సిఎం కి ఘనస్వాగతం పలికారు. టెక్స్ టైల్స్ హబ్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతానని కెసీఅర్ చెప్పరు. నిరుద్యోగుల ఉపాధికి ఎంతో దోహదపడుతుందన్నారు.
పరకాల అభివృద్ధి కి రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ఈ సభలోనె సిఎం వెల్లడించారు. ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అభ్యర్దన మేరకు పరకాలను రెవిన్యూ డివిజన్ గా మారుస్తానని, దీనికి సంబందించి త్వరలోనే ఉత్తర్వులిస్థానని చెప్పారు. ప్రపంచస్థాయి లో ఏర్పాటు చేసే టెక్స్ టైల్స్ పార్క్ కోసం 30000 కోట్ల పెట్టుబడి పెట్టే వారితో ఎంఓయూ చేసుకున్నామన్న కెసీఅర్.భూమిని కోల్పోయిన రైతులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు.

Updated: October 22, 2017 — 1:22 pm

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017