రేవంత్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ టిడిపి నేత కంచర్ల భూపాల్ రెడ్డి కన్నీటి పర్యంతం

Revanth reddy’s resignation left TDP leader Kancharla Bhupal reddy in tears

 

రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ టిడిపి నేత కంచర్ల భూపాల్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. భాపాల్ రెడ్డి 2014 ఎన్నికలలో నల్లగొండ నుండి పోటీ చేసారు. అతి కొద్ది ఓట్ల తేడాతో ఆయన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా నల్లగొండ నియోజక వర్గాన్ని తెలుగు దేశం పార్టీ బారతీయ జనతా పార్టీ కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఇండిపెండెంటుగా పోటీ చేసి కూడా కంచర్ల భాపాల్ రెడ్డి బారీ ఓట్లను సాధించారు.
నందమూరి బాలకృష్ణ కు కంచర్ల భూపాల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు.
kancharla bhupal reddyరేవంత్ రెడ్డి రాజీనామా ఆయనను తీవ్రంగా కలచివేసింది. కంచర్ల భూపాల్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊరడించారు. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ సమర్పించి వెళ్లిపోయిన తర్వాత తెలంగాణా టిడిపి నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశంలో భూఫాల్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు.

రేవంత్‌రెడ్డి ఒంటరిగా వెళ్లడం బాధించిందని, పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడవంతో ఒత్తిడికి గురై ఏడ్చానని కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు.
తాను పార్టీ మారతున్నానని పత్రికల్లో వచ్చిన వార్తలపై భూపాల్‌రెడ్డి ఆవేదన చెందారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన కాంట్రాక్టర్ గా నష్ఠపోయారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీని వీడినా తాను పార్టీని వీడలేదని, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పోరాడుతున్నానని కంచర్ల భూపాల్ రెడ్డి చంద్రబాబుకు వివరించారు. టీటీడీపీ నేతల్లో కొందరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించారని సమావేశంలో కంచర్ల భూపాల్‌రెడ్డి విలపించారు. దాంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణంలో వెళ్లింది. ధైర్యంగా ఉండాలని భూపాల్‌రెడ్డి చంద్రబాబు ఊరడించారు.

Updated: October 28, 2017 — 5:47 pm

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017