సూర్యాపేట లో వార్డు ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించిన కౌన్సిలర్

Share with a friendShare on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0Digg thisPin on Pinterest0

సూర్యాపేట(న్యూస్24) : సూర్యాపేట మున్సిపాల్టీ లో ఒక కౌన్సిలర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ప్రజల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు పట్ల వార్డు ప్రజల్లో ఆనందం వెల్లువిరిసింది. స్థానిక 2 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ స్వయంగా వార్డులోని ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని, బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా చేయించారు. ముగ్గురు డాక్టర్లచే సుమార్ 1000 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. వార్డు అభివృద్దితో పాటు నా వార్డు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ కోరిక అని న్యూస్24 కు తెలిపిన కౌన్సిలర్.

Updated: December 17, 2017 — 1:14 pm

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017