సూర్యాపేట లో రెచ్చిపోతున్న దొంగలు

సూర్యాపేట టౌన్(న్యూస్24) : జిల్లా కేంద్రంలోని షాపులనే టార్గెట్ చేసుకొన్న దొంగలు ఆదివారం తెల్లవారుజామున వరుస షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. కేవలం 20 రోజుల్లోనే మూడు దొంగతనాలు చేసి, పోలీసులకు సవాల్ విసిరారు. సుమారు రూ.40వేలు అపహరించినట్లు తెలిసింది. కుడకుడ రోడ్ నే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. షాపులపై నుండి కన్నం వేసి నగదు, సిసి కెమెరాలు ఎత్తుకెళ్ళినట్లు యజమానులు విలపిస్తూ, నామమాత్రపు పెట్రోలింగ్ వల్లనే ఈ చోరీలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇటీవల కాలం లో రక్షణ కరువైందని భయభ్రాంతులకు గురౌతున్నట్లు తెలుపుతున్నారు.

Updated: February 11, 2018 — 6:58 am

Rate This:

[Total: 0    Average: 0/5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

NEWS24Gantalu © 2017