Category: Crime

బావి లో గుర్తు తెలియని మృతదేహం

సూర్యాపేట / కోదాడ : చిలుకూరు మండలం దూదియా తండా వద్ద ఓ వ్యవసాయ బావిలో ఆటో బోల్తా పడినట్లు అనుమానం.. ఈరోజు బావి నీటిలో తేలియాడుతున్న ఓ వ్యక్తి మృత దేహం. సంఘటన జరిగి రెండు మూడు రోజులు కావచ్చు అంటున్న స్థానికులు.

Updated: October 21, 2017 — 6:41 am

జనగామ జిల్లా లో మహిళ దారుణ హత్య

జనగామ : జనగామ జిల్లా చెల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో దారుణంగా హత్యకు గురైన మహిళ. భూమితగాదాల నెపంలో కొంతం భాగ్య (40) ను కత్తితో నరికి చంపిన ప్రత్యర్ధులు.

Updated: October 21, 2017 — 6:51 am

ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

మహబూబాబాద్ : పెద్దపెద్ద చదువులు చదివినా ప్రభుత్వ కొలువులు రావట్లేదని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో వెంకటసోములు(36) అనే యువకుడు పెద్ద చదువు చదివినా ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated: October 21, 2017 — 6:52 am

ఇంటరాగేషన్ కు హాజరైన యన్.కౌశిక్ రెడ్డి

Koushik Reddy

కరింనగర్/జమ్మికుంట : గతంలో నమోదైన ఒక కేసు విషయమై ఇంటరాగేషన్ కు హాజరై జమ్మికుంట పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా నాయకులు యన్.కౌశిక్ రెడ్డి కి భారీ ఎత్తున స్వాగతం పలికి, ర్యాలీ తీసిన అభిమానులు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ ప్రజలకోసం పార్టీ కోసం ఎంతవరకైనా పోరాడుతానంటూ, ఫాల్స్ కేసులు నన్నేమీ చేయలేవన్నారు.

Updated: October 21, 2017 — 6:53 am

ఆర్టీసి బస్సు లారీ ఢీ యిద్దరు మృతి

జనగామ / స్టేషన్ ఘన్‌పూర్ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామ శివారులో వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు లారీ ఢీకొనడంతో డ్రైవర్ తో పాటు, ప్రయాణీకుడు మృతి, పలువురికి గాయాలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.

Updated: October 21, 2017 — 6:58 am

చెట్టుకు ఢీకొన్న తవేర వాహనం యిద్దరు మృతి

జయశంకర్ భూపల్ పల్లి / తాడ్వాయి : వేములవాడ వెళ్ళి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వున్న మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకొని మణుగూర్ కు వెళ్ళే క్రమం లో తాడ్వాయి, చిన్నబొయినపల్లి మార్గమధ్యలో చెట్టుకు ఢీ కొన్న తవేర వాహనం. యిద్దరు మృతి, పలువురికి గాయాలు. గుంటిపల్లి వెంకటేశ్వర్ రావు(50), కొల్లి ఆదిలక్ష్మి(43) మృతి చెందగా, గద్దె అనిల్, ప్రణీత, కొల్లి హనుమంత రావు,శాకమూరి కృష్ణ వేణి,లక్ష్మి కుమారి గాయాలపాలైనారు.

Updated: October 21, 2017 — 6:58 am

చైన్ స్నాచర్స్ అరెస్ట్

మహబూబాబాద్ : ట్రైన్లలో పలు చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుమ్మ నలుగురిని డోర్నకల్ల్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి, వారినుండి 12 తులాల బంగారం రికవరీ చేసిన డోర్నకల్ జీఆర్పీ పొలీసులు.

Updated: October 21, 2017 — 6:58 am

యాదగిరి గుట్టలో వ్యక్తి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామం దగ్గర హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతి.

Updated: October 21, 2017 — 6:59 am
NEWS24Gantalu © 2017