Category: Hyderabad

మాజీ మంత్రి శ్రీధర్ బాబు పై నమోదైన కేసు

హైదరాబాద్(న్యూస్24గంటలు) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తనను గంజాయి కేసులో ఇరికించేందుకు శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ, దానికి సంబందించిన పూర్తి వివరాలను పోలీసులకు అందించిన కిషన్ రెడ్డి. గత కొంత కాలంగా కిషన్ రెడ్డి, శ్రీధర్ బాబు మధ్య […]

Updated: October 22, 2017 — 7:05 am

హైదరాబాద్ లో భూ ప్రకంపనలు

హైదరాబాద్ (న్యూస్24గంటలు) : బోరబండ ప్రాంతంలోని ఎస్పీఆర్‌హిల్స్, ప్రతిభానగర్, బాబాసైలాని నగర్ లలో పలుమార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ఈ రోజు తెల్లవారుమున భూమి కంపించడం తో ప్రజలు భయాందోళనకు గురైనారు. అల్లాగే యూసఫ్ గూడ, బోరబండ ప్రాంతాల్లో కూడా శనివారం భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు అంటున్నారు.

Updated: October 22, 2017 — 2:05 am

ఆంధ్రా మంత్రికి కేసీఆర్ రూ. 2 వేల కోట్లు ఇచ్చారు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : దీపావళి పండుగకు ఒక రోజు ముందే బాంబులు పేల్చిన రేవంత్ రెడ్డి. టీడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్న రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ లో టీడిపి నేతలను జైళ్ళలో పెడుతుంటే, ఆంధ్రా టీడిపి నేతలేమో కేసీఆర్ కు వంగి వంగి దండాలు పెడుతుండడం ఎంత వరకు సబబు అని రేవంత్ ప్రశ్నిస్తున్న్నారు. ఆంధ్రా సీనియర్ మంత్రి యనమల రామకృష్ణ కు కేసీఆర్ రూ. 2 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. […]

Updated: October 21, 2017 — 6:54 am

సర్పంచులు జర జాగ్రత్త : సీఎం కేసీఅర్

హైదరాబాద్ : తమ విధులను సక్రమంగా నిర్వర్తించని గ్రామ సర్పంచిని తొలగించే అధికారం ప్రజలకు, ప్రభుత్వానికి ఉండేవిధంగా మార్పులు చేసి, ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తేవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచిస్తున్నారు. విధివిధానాల రూపకల్పనకు నిపుణుల సలహాలు తీసుకోనిన్నట్లు తెలిపారు. గ్రామాల్లో సర్పంచుల పని విధానంపై అసంతృప్తిగా వున్న సీఎం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకరావాలని భావిస్తున్నారు. గ్రామాలు, తండాలు బలోపేతానికి అధికంగా నిధులు వెచ్చిస్తామన్నారు.

Updated: October 18, 2017 — 3:26 am

పూజార్లను పెళ్ళాడితే రూ. 3 లక్షలు నజరానా

హైదరాబాద్ : పూజార్లను పెళ్ళి చెసుకొంటే దంపతుల పేర్ల మీద రూ. 3 లక్షలను ఉమ్మడి ఖాతాలో జమ చెస్తామని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవి.రమణాచారి తెలిపారు. వేదపండితులకు, పూజార్లకు వివాహం ఒక సంస్యగా మారిందని, వారికి పెళ్ళిళ్ళు కావడం కష్టసధ్యంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వారి వివాహాలను ప్రోత్సహించడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేద బ్రాహ్మణుల అత్యవసర వైద్యఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షల వరకు అందిస్తామన్నారు. అన్ని వర్గాల వారిని ప్రభుత్వం […]

Updated: October 18, 2017 — 3:23 am

విపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా : సీఎం కేసీఅర్

హైదరాబాద్ : విపక్షాలు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ నెల 27 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కెసీఆర్ తెలిపారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. సభ ఎన్ని రోజులు జరగాలనేది ఈ నెల 26 న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. సభ జరిగినన్ని రోజులు […]

Updated: October 17, 2017 — 11:58 am
NEWS24Gantalu © 2017