Category: Jangaon

జనగామ జిల్లా లో మహిళ దారుణ హత్య

జనగామ : జనగామ జిల్లా చెల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో దారుణంగా హత్యకు గురైన మహిళ. భూమితగాదాల నెపంలో కొంతం భాగ్య (40) ను కత్తితో నరికి చంపిన ప్రత్యర్ధులు.

Updated: October 21, 2017 — 6:51 am

అక్రమంగా తరలిస్తున్న గొర్రెలను అడ్డుకున్న అధికారులు

జనగాం : అక్రమంగా తరలిస్తున్న 400 గొర్రెలను పాలకుర్తి వద్ద అధికారులు అడ్డుకున్నారు. స్టేషన్ ఘణపురం మండలన్ ఇప్పగూడెం నుండి లారీలో తరలిస్తున్న వీటిని ప్రభుత్వ రాయితీపై పంపిణి చేయాల్సిన గొర్రెలుగా అనుమానిస్తూ, వాటిని స్వాదీనం చేసుకున్నారు.

Updated: October 19, 2017 — 4:11 am

నేనూ మంత్రినవుతా : ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగాం : 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి మంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తాననే ధీమా వ్యక్తం చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. టీ.అర్ర్.ఎస్ లోనే కొనసాగుతానని, వేరే నియోజకవర్గానికి నేను వెళతానని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కష్టకాలంలోను తనను వెన్నంటే వున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాల్సివుందని, అందుకు అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఇక్కడనుండే పోటీ చేస్తానని చెప్పారు.

Updated: October 21, 2017 — 6:54 am

ఆర్టీసి బస్సు లారీ ఢీ యిద్దరు మృతి

జనగామ / స్టేషన్ ఘన్‌పూర్ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామ శివారులో వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు లారీ ఢీకొనడంతో డ్రైవర్ తో పాటు, ప్రయాణీకుడు మృతి, పలువురికి గాయాలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.

Updated: October 21, 2017 — 6:58 am
NEWS24Gantalu © 2017