Category: Krishna (Machilipatnam)

అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కుదిరింది

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. నవంబర్ 8 నుండి 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి షెడ్యూల్ ను విడుదల చేశారు.అయితే ఈ సారి వర్షాకాల, శీతాకాల సమావేశాలు కలిపి నిర్వహిస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలు ఈ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై వ్యూహాలు సిద్దం చేసుకుంటుండగా, ఈ సమావేశాల్లోనె పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Updated: October 17, 2017 — 7:04 am
NEWS24Gantalu © 2017