Category: Warangal Rural

50 ఏండ్ల వ్యక్తితో మైనర్ బాలిక వివాహం, బాద్యుల అరెస్ట్

వరంగల్ రూరల్(న్యూస్24) : వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలోని కొనకంచె తండా కు చెందిన మైనర్ బాలికను రాజస్థాన్ కు చెందిన 50 సంవత్సరాల వయస్సు పైబడిన వ్యక్తితో వివాహం జరిపించేందుకు ప్రయత్నించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల వివరాలను మీడియాకు తెలియజేసిన నర్సంపేట ఏసీపీ సునితా మోహన్.

Updated: November 27, 2017 — 11:04 am

బార్ రెస్టారెంట్ కు అనుమతి ఇవ్వవద్దని నర్సంపేట ఏసీపీ కి వినతి

వరంగల్ రూరల్(న్యూస్24) : నర్సంపేట పట్టణం లోని పాఖాల సెంటర్ లో బార్ రెస్టారెంట్ కు అనుమతి ఇవ్వవద్దని ఏసీపీ సునితామోహన్ ను కోరిన 4వ వార్డు ప్రజలు. గతంలో సాగరిక వైన్స్ ఉండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వైన్స్ మార్చారని, మళ్ళీ వైన్స్ స్థానలోనే బార్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అనుమతి ఇవ్వద్దని ఏసీపీ ని కోరారు. కాలనీకి చెందిన సోల్తీ సారయ్య, తక్కళ్ళపల్లి […]

Updated: November 27, 2017 — 10:25 am

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వరంగల్ రూరల్(న్యూస్24గంటలు) : వర్దన్నపేట నియోజకవర్గం పరిధిలో శనివారం జరిగిన అనేక పెళ్ళిళ్ళకు స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించి, వారికి ప్రభుత్వం తరపున  కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్ రావు, పర్వతగిరి ఎంపిపి రంగు రజిత, ఏనుమాముల మార్కెట్ వైస్ చైర్మెన్ జితేందర్ రెడ్డి, మనోజ్ గౌడ్, సుధాకర్, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated: November 26, 2017 — 3:42 am

వరంగల్ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

వరంగల్ రూరల్ (న్యూస్24) : వర్ధన్నపేట మండలం కట్రియాల లో కొలువై వున్న దూడల మల్లన్న ఆలయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.

Updated: November 21, 2017 — 11:06 am

తల్లీకొడుకుల ఆత్మహత్య

వరంగల్ రూరల్(news24gantalu.com) : వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం లో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లి కొత్తకొండ రాధిక తన ఐదేళ్ళ కొడుకు సాయికృష్ణ లు యిద్దరు వురివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ తగాదాలే కారణమంటున్న బంధువులు.

Updated: November 21, 2017 — 5:34 am

సైన్స్ ఫెయిర్ ను సందర్శించిన ఎమ్మెల్యే

వరంగల్ రూరల్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు మడికొండలో సోమవారం నిర్వహించిన స్పెక్ట్రం 2017 జోనల్ లెవల్ సైన్స్ ఫెయిర్ లో పాల్గొని ఆసక్తిగా తెలకిస్తున్న వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్.వీరితో పాటు కార్పోరేటర్ జోరిక రమేష్, ఆర్‌సిఓ రమాదేవి, డిఎస్‌డిఓ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ ఉమాదేవి ఉన్నారు.

Updated: October 24, 2017 — 7:34 am

కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ కు శంకుస్థాపన చేసిన సభలోనే పరకాలకు రూ.50 కోట్ల నిధులిస్తానన్న సిఎం కేసీఅర్

వరంగల్ రూరల్(న్యూస్24గంటలు) : కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ కు ఆదివారం శంకుస్థాపన చేసిన సిఎం కేసీఅర్. టెక్స్ టైల్స్ పార్క్ శంకుస్థాపన కోసం గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద సిఎం కి ఘనస్వాగతం పలికారు. టెక్స్ టైల్స్ హబ్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతానని కెసీఅర్ చెప్పరు. నిరుద్యోగుల ఉపాధికి ఎంతో దోహదపడుతుందన్నారు. పరకాల అభివృద్ధి కి రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ఈ సభలోనె సిఎం […]

Updated: October 22, 2017 — 1:22 pm

ఆదివారం జరిగే సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన కడియం శ్రీహరి

వరంగల్ రూరల్ (న్యూస్24గంటలు) : కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పర్క్ కు రేపు ఆదివారం సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభా ఏర్పాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి వేదిక వద్దనే మీడియా తో మాట్లాడుతూ, ఆదివారం వరంగల్ కు సంబందించిన 4 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సీఎం శంఖుస్థాపన చేస్తారన్నారు. కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గొర్రెలు,మేకల అభివృద్ది సంస్థ చైర్మెన్ […]

Updated: October 22, 2017 — 2:47 am

కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిక

వరంగల్ రూరల్ : శాయంపేట మండలం నూర్జహాన్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర హౌజింగ్ ఫెడరేషన్ చైర్మెన్ నవనీతరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, టిడిపి పర్టీలకు భవిష్యత్తు లేకపోవడంతో పాటు సీఎం కేసీఆర్ అభివృద్ది పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాయంపేట ఎంపిపి చంద్రప్రకాష్, పార్టీ నాయకులు గుర్రం రవిందర్ తో […]

Updated: October 21, 2017 — 5:47 am
NEWS24Gantalu © 2017